4.5.2016
ప్రశ్న: సర్ .. మంచి ధ్యాన సాధనతో, కార్యాలయ పనులు అప్రయత్నంగా చేయవచ్చని, మరియు పనిని త్వరగా పూర్తి చేయవచ్చని నేను భావిస్తున్నాను. కానీ సమస్య ఏమిటంటే, మనస్సులో ఒక భాగం, ఇది తేలికగా సంపాదించిన సొమ్ము అని తెలుపుతుంది. సహాయపడటానికి ఉపయోగించాను మరియు దీని వల్ల నాకు డబ్బులు అవసరమైనప్పుడు నా స్నేహితులు మరియు బంధువుల నుండి రుణం తీసుకోవాలిసిన పరిస్థితి వస్తుంది. నేను ఈ జీవితాన్ని ఎలా సమతుల్యం చేసుకోగలను, ఎందుకంటే మనస్సులో కొంత భాగం ఇది తేలికైన డబ్బు అని అనుకుంటుంది మరియు మనస్సు యొక్క మరొక భాగం, నీవు ఏ పని అయినా చేయగలిగిన సామర్ధ్యం ఉన్నవాడివని, ఆర్థిక సమస్య లాంటివి తేలిగ్గా అధికమించగలవాని తెలుపుతుంది. నేను గందరగోళంలో ఉన్నాను. దయచేసి సలహా ఇవ్వండి.
జవాబు: మీరు ధ్యానం చేసినప్పుడు, మీ పనితీరు మెరుగుపడుతుంది. కాబట్టి, మీరు మీ పనిని వేగంగా పూర్తి చేయవచ్చు. ఇది నిజంగా మంచిది. కానీ మీకు లభించే జీతం సులభంగా వచ్చిన డబ్బు అని మీరు అనుకుంటారు. ఇప్పుడే మీరు ఎన్నో ఇబ్బందులను ఆహ్వానిస్తున్నారు. మీరు మరింత ఒత్తిడితో ఎక్కువ పని చేయాలనుకుంటున్నారు. మీ పని కోసం సంఘం ఆ జీతాన్ని నిర్ణయించింది. ఇది తేలికైన డబ్బు అని ఎందుకు అనుకుంటున్నారు?
మీకు ఎక్కువ డబ్బు ఉంటే, కొంత శాతం డబ్బును సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోండి. మీకు ఉద్యోగం / తగినంత డబ్బు లేనప్పుడు, ఆర్థిక విషయాలు పెద్ద సమస్య అవుతుంది. మీకు సురక్షితమైన ఉద్యోగం మరియు తగినంత డబ్బు ఉన్నప్పుడు, ఆర్థిక విషయాలు పెద్ద సమస్య కాదు. మీరు ఏమి చేయాలనుకుంటున్నారో, దానికి మీకు డబ్బు అవసరం.మీరు డబ్బును ఖర్చుచేయాలిసిన పరిస్థితి వస్తుంది లేక ఇతరులనుంచి ఆశించాలిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి, డబ్బును విస్మరించవద్దు.
కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చుని, మీ సామర్థ్యం ఏమిటో విశ్లేషించండి. అప్పుడు, మీరు ఏమి చేయగలరో నిర్ణయించుకోండి. ప్రణాళిక మరియు తదనుగుణంగా పని చేయండి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు చాలా విషయాల వల్ల ప్రభావితమవుతారు. మీరు అందరికీ సహాయం చేయలేరు. కాబట్టి, మీ పరిమితిని గ్రహించి, మీరు ఏ ప్రాంతానికి పని చేయబోతున్నారో నిర్ణయించుకోండి.
శుభోదయం... స్వచ్ఛందంగా ఇబ్బందులను పిలవకండి ..💐
వెంకటేష్ - బెంగళూరు
(9342209728)
యశస్వి భవ
Comments