18.5.2015
ప్రశ్న: మీ పాత్రను ఎవరు సృష్టిస్తున్నారు?
జవాబు: దైవ నాటకంలో, ప్రతి ఒక్కరూ తమదైన పాత్రను సృష్టించాలి. అది దైవ నాటకం యొక్క అందం. మీ పాత్రను సృష్టించే స్వేచ్ఛ మీకు ఉన్నందున, మీరు ఒక ఉదాహరణ కోసం చూస్తున్నారు. బహుశా మీ రోల్ మోడల్ ఒక రంగంలో ప్రముఖుడు లేదా మంచి పేరొందిన మనిషి కావచ్చు. మీరు వారి స్థితిని మరియు స్థాయిని ఇష్టపడతారు. నిజానికి, వారి స్వంత పిల్లలు అదే దాన్ని సాధించనటువంటి సందర్భలో ఎన్నో ఉన్నాయి. ఒక వేళా ఆ ప్రముఖుడికి లేక కళాకారుడుకి (సెలబ్రిటీ) మరి ఒక అవకాశం ఇచ్చినట్లయితే మునుపు సంధించంత సాధించాక లేకపోవచ్చు ఎందుకంటే చరిత్ర ఎప్పుడూ పునరావృతం కాదు.
పరిస్థితి మారిన ప్రతిసారీ, మీరు పరిస్థితికి అనుగుణంగా మీ పాత్రను మార్చాలి. మీరు ఒకరిని అనుసరిస్తే, పరిస్థితికి అనుగుణంగా మీరు మీ పాత్రను మార్చలేరు. అది అసలు సమస్య.
జీవితం ఒక ప్రయాణం. మార్గం ఎంచుకోండి లేక తెలుసుకోండి మరియు మీ స్వంతంగా ప్రయాణించండి.
ట్రాఫిక్ రూల్స్ తెలుసు కాబట్టి, మీ ప్రయాణాల కోసం మీరు ఇతరుల నుండి మార్గదర్శకత్వం అందుకుంటారు. గైడ్ కాకుండా మార్గాన్ని అనుసరించండి. మీ జీవిత పరిస్థితులకు కొన్నిసార్లు మార్గదర్శకాలు వర్తించవని గుర్తుంచుకోండి. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి మరియు మీ పాత్రను మార్చాలి.
శుభోదయం ... మీ ప్రయాణం ఆనందంగా ఉండనివ్వండి ...💐
వెంకటేష్ - బెంగళూరు
(9342209728)
యశస్వి భవ
Comments